ఫుట్‌బాల్‌ దిగ్గజం మారియో జగల్లో కన్నుమూత

Jan 8,2024 15:14 #Foot Ball, #Sports

ఫుట్‌బాల్‌ దిగ్గజం, బ్రెజిల్‌ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) కన్నుమూశారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో తుదిశ్వాస విడిచారు. నాలుగు సార్లు వరల్డ్‌కప్‌ విన్నర్‌ అయిన మారియో.. బ్రెజిల్‌ ఫుట్‌బాలర్‌గానే కాకుండా ఆ జట్టుకు కోచ్‌గా కూడా సేవలందించాడు. మారియో.. పీలేతో కలిసి 1958, 1962 ప్రపంచకప్‌లు గెలిచాడు. 1970లో వరల్డ్‌కప్‌ గెలిచిన బ్రెజిల్‌ జట్టుకు మారియో మేనేజర్‌గా పని చేశాడు. అలాగే 1994 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టుకు మారియో కో ఆర్డినేటర్‌గా పని చేశాడు. 2002లో వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టుకు మారియో అడ్వైజర్‌గా వ్యవహరించాడు.

➡️