పలాసలో అడుగంటిన బావి

పలాసలో అడుగంటిన బావి
  • లోలోపలకు జలంపెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు
  • క్రమేణా తగ్గుతున్న నీటిమట్టం నిల్వలు

*  గతేడాదితో పోలిస్తే 1.74 మీటర్లు కిందికి చేరిన జలాలు

  • తీవ్ర వర్షాభావ పరిస్థితులే కారణమని భావిస్తున్న అధికారులు
  • 53 గామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం

జిల్లాలో క్రమేణా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోత, వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనానికి తాగునీటి సమస్యలూ తప్పడం లేదు. పెరుగుతున్న ఎండ వేడిమితో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోర్లు బావురుమంటున్నాయి. బావులు ఎండిపోతున్నాయి. రాబోవు రోజుల్లో వేసవి తాపం మరింత పెరగునున్న నేపథ్యంలో భూగర్భ జలాలు మరింత అడుగుకు చేరనుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది 1.78 మీటర్ల మేర నీరు అడుగుకు చేరింది. జిల్లాలో గత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు భావిస్తున్నారు. రాబోవు రోజుల్లో మరింత ఎండ వేడిమి పెరిగే అవకాశం ఉండటంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఎండలు ముదురుతుండటంతో ఈ ఏడాది మార్చిలో జిల్లాలో నీటిమట్టం నిల్వలు సగటున 7.96 మీటర అడుగున లభ్యమవుతున్నాయి. ఫిబ్రవరిలో జిల్లా సగటు 7.28 మీటర్లుగా ఉంది. నెల రోజుల వ్యవధిలో 0.68 మీటర్ల మేర నీరు అడుగుకు చేరింది. 2023 మార్చితో పోలిస్తే నీటి మట్టం నిల్వలు 1.74 మీటర్ల లోతుకు జలాలు చేరాయి. గతేడాది మార్చిలో 6.22 మీటర్లుగా నమోదైంది. జిల్లాలో రణస్థలం మండలం పైడిభీమవరం ప్రాంతంలో 34.92 మీటర్ల లోతుకు నీరు చేరింది. భూగర్భ జలాల స్థాయి ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. భూగర్భ జలాలు మూడు మీటర్లలోపు లభ్యమైతే దానిని సురక్షిత స్థాయిగా పరిగణిస్తారు. మూడు నుంచి ఎనిమిది మీటర్ల మధ్యన నీటి నిల్వలు ఉంటే ఆ జోన్‌ను సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. ఎనిమిది నుంచి 15 మీటర్ల మధ్య ఉన్న జోన్‌ను క్లిష్ట జోన్‌గా పరిగణిస్తారు. 15 నుంచి 20 మీటర్ల మధ్య నీరు లభ్యమైతే దానిని సంక్లిష్ట స్థాయిగా గుర్తిస్తారు. 20 మీటర్లు దాటినా నీరు లభ్యం కాకుంటే ప్రమాదకర జోన్‌గా నిర్ణయిస్తారు. మార్చి నెల ముగిసే నాటికి భూగర్భ జలశాఖ అధికారులు అందించిన వివరాలను పరిశీలిస్తే భూగర్భ జలాల పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్ధమమవుతుంది. జిల్లాలో 30 మండలాల పరిధిలోని పలు చోట్ల నీటి లభ్యత నమూనాలను తీశారు. వాటి ప్రకారం ప్రస్తుతం మూడు మండలాలు మాత్రమే సురక్షిత స్థాయిలో ఉన్నాయి. 19 మండలాల్లో భూగర్భ జలాలు సాధారణ స్థాయిలో ఉన్నాయి. ఆరు మండలాలు క్లిష్ట జోన్‌లో ఉండగా రెండు మండలాలు సంక్లిష్ట జోన్‌లో ఉన్నాయి.నీటి మట్టం ఆధారంగా మండలాల పరిస్థితి ఇలా భూగర్భ జలాలు మూడు మీటర్లలోపు లభ్యమయ్యే సురక్షిత జోన్‌ మండలాల్లో ఎల్‌ఎన ్‌పేట, హిరమండలం, సరుబుజ్జిలి మండలాలు ఉన్నాయి. సాధారణ స్థాయిలో నీటి నిల్వలు ఉన్న మండలాల్లో ఆమదాలవలస, బూర్జ, జి.సిగడాం, గార, ఇచ్ఛాపురం, జలుమూరు, కొత్తూరు, లావేరు, టెక్కలి, మెళియాపుట్టి, సారవకోట, పలాస, మందస, మెళియాపుట్టి, పొందూరు, పోలాకి, సంతబొమ్మాళి, పాతపట్నం, శ్రీకాకుళం, మండలాలు ఉన్నాయి. క్లిష్ట జోన్‌ పరిధిలో ఎచ్చెర్ల, కంచిలి, లావేరు, సారవకోట, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాలు ఉన్నాయి. కవిటి, రణస్థలం మండలాలు సంక్లిష్ట జోన్‌లో ఉన్నాయి.నీటి మట్టం పడిపోవడానికి కారణలివేగతేడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నీటి మట్టం నిల్వలు పడిపోవడానికి దారి తీసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నైరుతి రుతుపవనాల సమయంలో అంటే జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకు జిల్లాలో సాధారంగా 696.44 మి.మి వర్షం కురవాల్సి ఉండగా, 699.27 వర్షం పడింది. అంటే సాధారణం కంటే 0.41 శాతం మాత్రమే కురిసింది. ఈశాన్య రుతు పవనాల సమయంలో అంటే అక్టోబరు ఒకటి నుంచి డిసెంబరు 31 వరకు సాధారణంగా 294.33 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 75.17 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 74.46 శాతం తక్కువ పడింది. పెరిగింది. అదేవిధంగా శీతాకాలం సీజన్‌లో అంటే జనవరి 1 నుంచి నుంచి ఫిబ్రవరి 29 వరకు సాధారణంగా 25.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పుడు 4.5 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. వర్షపాతం లోటు 82.6 శాతం ఉంది. వర్షాలు లేకపోవడం, నదుల్లో నీటి ప్రవాహం బాగా తగ్గిపోవడంతో ఈ సంవత్సరం రబీ పంటలకు జనవరి రెండో వారం నుంచి నీటిని ఆపేశారు. భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణంగా కనిపిస్తోంది. బోర్ల తవ్వకాలపై నిషేధంజిల్లాలో 53 గ్రామాల్లో అధిక శాతం భూగర్బ జలాలు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో రణస్థలం, లావేరు, జి.సిగడాం, పొందూరు మండలాలకు చెందిన గ్రామాలు ఉన్నాయి. రణస్థలంలో అత్యధికంగా 30 గ్రామాలున్నాయి. లావేరులో 14 గ్రామాలు, పొందూరులో ఐదు, జి.సిగడాంలో నాలుగు గ్రామాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌, ల్యాండ్‌, ట్రీస్‌ యాక్టు-2002 ప్రకారం వీటిని అధిక భూగర్భ జలాల వినియోగిస్తున్న గ్రామాల జాబితాలో చేర్చింది. దీంతో తాగునీటి అవసరాలకు తప్ప ఈ గ్రామాల్లో బోర్ల తవ్వకూడదంటూ ఈ ఏడాది జనవరి 23న నోటిఫికేషన వెలువరించింది. దీంతో పాటు ఇసుక, గనుల తవ్వకాలు చేపట్టకూడదని సూచించింది.

➡️