తొలగించిన వలంటీర్లను వెంటనే తీసుకోవాలి : సిఐటియు

Dec 30,2023 10:48 #CITU, #volunteers

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వలంటీర్లు సమ్మె నోటీసిచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వారిని తొలగిస్తూ నోటిసులిస్తోందని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నరసింగరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవ వేతనం పేరుతో వలంటీర్లను ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. వలంటీర్లు తమకు కనీస వేతనాలివ్వాలని, సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. వలంటర్లీతో చర్చించి సమ్మె విరమింపజేయాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కనీస కోర్కెలను తీర్చాలని సమ్మె చేయడం ప్రభుత్వ విధానాలకు ఎలా వ్యతిరేకం అవుతుందని సిఐటియు నేతలు ప్రశ్నించారు.

➡️