పాక్‌కు ఫైన్‌.. 10 శాతం మ్యాచ్‌ ఫీజు కోత

Dec 19,2023 08:40 #Pakistan, #Sports, #Test Cricket

ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో ఘోర పరాజయం పొందిన బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో షాక్‌ తగిలింది. తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాక్‌కు ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోతపెట్టడమే కాకుండా రెండు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) పాయింట్స్‌ను తగ్గించినట్టు ఐసీసీ సోమవారం వెల్లడించింది. నిర్ణీత సమయంలో పాక్‌ జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌లోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. స్లో ఓవర్‌ రేట్‌ ఉల్లంఘనకు ప్రతి ఓవర్‌కు 5 శాతం జరిమానా విధించొచ్చు. అలాగే, డబ్ల్యూటీసీ నిబంధనల్లోని ఆర్టికల్‌ 16.11.2 ప్రకారం.. ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్‌ తగ్గించబడుతుంది. కాగా, తొలి టెస్టులో ఆసిస్‌ చేతిలో పాక్‌ జట్టు 360 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌లో పాకిస్తాన్‌ రెండో స్థానానికి పడిపోగా.. భారత్‌ టాప్‌ పొజిషన్‌కు చేరుకుంది.

➡️