Fatal accident – లోయలో బస్సుపడి 45మంది మృతి

కేప్‌టౌన్‌ (సౌత్‌ ఆఫ్రికా) : సౌత్‌ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపైనుండి బస్సు లోయలోకి పడిపోవడంతో 45మంది మృతి చెందారు. బస్సులో ఉన్నవారంతో మరణించగా, ఒక చిన్నారి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

స్థానిక అధికారుల సమాచారం మేరకు … బోట్స్‌వానా నుంచి మోరియాకు 46 మందితో బస్సు బయలుదేరింది. ఈ క్రమంలోనే ఉత్తర ప్రావిన్స్‌ లింపొపోలోని మమట్లకల సమీపంలో కొండపై నిర్మించిన వంతెన మలుపులో బస్సు తిరుగుతుండగా అదుపుతప్పింది. బస్సును డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడు. బస్సు వంతెనపై నుంచి 165 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోసహా 45 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. 8 ఏళ్ల వయసున్న ఒక్క చిన్నారి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. లోయలో పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో కొన్ని మఅతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.

➡️