ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు దుగ్గి చెన్నారెడ్డి మృతి

ప్రజాశక్తి – రెడ్డిగూడెం, విస్సన్నపేట: ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమంలో చీఫ్‌ కొరియర్‌గా పనిచేసిన దిగి చెన్నారెడ్డి (97) బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఎన్‌టిఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలోని తన స్వగృహంలో మృతి చెందారు. సాయంకాలం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు కుమారుడు శ్రీనివాసరెడ్డి, కుమార్తె అరుణకుమారి ఉన్నారు. ఆయన భార్య స్వరాజ్యమ్మ ఏడేళ్ల క్రితం చనిపోయారు. ఐదో తరగతి వరకు చదువుకున్న ఆయన అప్పటి తిరువూరు తాలూకా ప్రాంతంలో జమీందారులు, భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కమ్యూనిస్టు పార్టీ నిషేధ కాలంలో రహస్యంగా పార్టీ కొరియర్‌గా పనిచేశారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకొని శాఖ కార్యదర్శిగా పనిచేశారు. విస్సన్నపేట మండలం పుట్రేలలో కమ్యూనిస్టు పార్టీకి తోడ్పాటునందించారు. ఆయన కుమారుడు దుగ్గి శ్రీనివాస్‌ రెడ్డి ఉపాధ్యాయుడిగా ఉంటూ యుటిఎఫ్‌ మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. పలువురు నేతల నివాళిచెన్నారెడ్డి మృతి పట్ల సిపిఎం సీనియర్‌ నాయకులు, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బిఆర్‌.తులసీరావు సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్రను గుర్తుచేసుకున్నారు. భౌతికకాయాన్ని సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కఅష్ణ సందర్శించి నివాళులర్పించారు.

➡️