తప్పుడు ఆరోపణలు సహించేది లేదు

Mar 30,2024 12:25 #Vizianagaram

జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి

ప్రజాశక్తి-బొబ్బిలి : జనసేన బలోపేతానికి, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పని చేస్తే తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి అన్నారు. జనసేన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన స్థాపించినప్పటి నుంచి జనసేన బలోపేతానికి పని చేయడంతో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం ప్రాంతాల్లో మంచి గుర్తింపు వస్తుందన్నారు. జనసేనలో మంచి గుర్తింపు రావడం వలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు ప్రజలు, జనసైనికులు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం ప్రాంతాల్లో తాను చేస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎగసిపడే కెరటాలులాగా జనసైనికులు పని చేస్తున్నారన్నారు. 2021లో రాష్ట్ర కార్యక్రమాల నిర్వాహక కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లి సభకు కమిటీ సభ్యునిగా నియమించారని చెప్పారు. కొంతమంది స్వార్ధ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే మేము జనసేన కోసం, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పని చేస్తున్నామని చెప్పారు. మిత్రపక్షాలను పక్కదారి పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎగిసిపడే కెరటాలులాగా కాలు వద్దకు వస్తే మట్టేస్తామని చూస్తే కెరటంల లెచస్తామన్నారు. చక్కెర పరిశ్రమ సమస్యపై పోరాటం చేస్తే కుటుంబంపై బెదిరింపులకు దిగారని చెప్పారు. తన తండ్రి తనకు సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తున్నారని చెప్పారు. పట్టణ, గ్రామాల్లో జనసైనికులు వివరాలను సేకరిస్తే డేటా చోరీ చేస్తున్నామని ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. కూటమిను దెబ్బతీసేందుకు కొంతమంది పని చేస్తున్నారన్నారు. జనసేనకు, ప్రజలు, బొబ్బిలి ప్రాంతానికి నష్టం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిస్వార్ధంతో సొంత డబ్బులు ఖర్చు చేసుకుని జనసేన బలోపేతానికి పని చేస్తే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడతామన్నారు. పదవులతో సంబంధం లేకుండా జనసేన ఆశయ సాధనకు పని చేస్తామన్నారు. బేబినాయన గెలుపుకు పని చేస్తామని చెప్పారు. జనసేన మండల అద్యక్షులు ఎస్.గంగాధర్ మాట్లాడుతూ నియోజకవర్గ ఇంచార్జి విభజించి పాలించు రకంగా పని చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎం.రవికుమార్, ఆర్.కిరణ్ కుమార్, జనసైనికులు పాల్గొన్నారు.

➡️