టమోటా ధర పతనం – దళారులుదే హవా

Feb 29,2024 11:40 #anakapalle district
Fall in tomato price - brokers are the wind

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని టమోటా ధర పతనం అయినా, దళారి వ్యాపారులుదే హవా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కోన్నారు. గురువారం దేవరాపల్లి హోలసెల్ కాయగూరలు మార్కెట్ ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరంఆయన విలేకర్లతో మాట్లాడారు. దేవరాపల్లి మండల కేంధ్రంలో గల కాయగూరలు మార్కెట్ ఒకప్పుడు ఉత్తర ఆంధ్రాలో మంచి పేరుందన్నారు. ఈ ప్రాంతంలోని పండించిన వంకాయి బరంపురం ఒరిస్సా అనేక రాష్ర్టాలకు, చుట్టుప్రక్కల జిల్లాలకు వెళ్ళేదని తెలిపారు. పాలకవర్గాలు రైతులను ప్రోత్సహించకపోవడంతో, మద్దతు ధర లేకపోవడం, ధళారిలు బెడద ఎక్కువ అవ్వడం సరియైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం రైతులు అసంతృప్తితో కాయగూరలు పండించడానికి వెనుక ఆడుగు వేస్తూన్నారని తెలిపారు. ఇప్పటికి చీడికాడ, వేపాడ దేవరాపల్లి, కె కోటపాడు, ఆనంతగిరి మండలాలకు చెందిన రైతులు కాయగూరలు పండించి మార్కెట్ కు తీసుకువస్తూన్నారని తెలిపారు. వ్యాపారులు మాత్రం సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం వరకు ఒక కేటు 20 kgపై బడి ఉన్న టమోటాలు రూ.500 నుండి 600 ఉంటే, ఈరోజు 200 రూపాయలకు పడి పోయిందని తెలిపారు. అంటే kg టమోటా 10 రూపాయలు కూడా అమ్ముడుపోవడంలేదన్నారు. దళారి వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను విసిగెత్తించి ఎంతో కొంతకి కోనుగోలు చేసి పట్టుకుపోతున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి పండించి మార్కెట్ కు తీసుకు వస్తే కోనే నాదుడు కరువు అయ్యారని తెలిపారు. మార్కెట్ రైతులకు నిలువ కూడా ఉండడం లెదన్నారు. రైతులకు మద్ధతు ధర కోసం పాలక వర్గాలకు చీమకుట్టినట్టు అయిన లెదన్నారు. దేవరాపల్లి హోల్ సెల్ కాయ గూరలు మార్కెట్ లో కోల్డోస్టోరేజి నిర్మిస్తామని పాలకులు హామీ నేర వేర లెదన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వ ఆదికారులు స్పందించి రైతులకు మద్దతు ధర వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని ధళారి వ్యాపారులను ఆరికట్టాలని వెంకన్న డిమాండ్ చేసారు.

➡️