రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

Apr 13,2024 18:11 #MLC KS Lakshmana Rao, #speech

ప్రజాశక్తి- కలక్టరేట్‌ (కృష్ణా) :డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు సూచించారు.డా.బిఆర్‌ అంబేద్కర్‌ 134 వ జయంతిని పురస్కరించుకుని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ( కె వి పి ఎస్‌)కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నంలోని ఈశ్వర్‌ రెసిడెన్సీలో ‘ప్రమాదంలో రాజ్యాంగం-నేటి కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.కె వి పి ఎస్‌,జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన కె యస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఈ పది సంవత్సరాల నుంచి రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని రాష్ట్ర హక్కుల దగ్గర నుంచి రాజ్యాంగం లో ఉన్నటువంటి మూల అంశాలు అయినటువంటి ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సామాజిక న్యాయం, పూర్తిగా ధ్వంసం కాబడుతున్నయన్నారు.అలాగే రాజ్యాంగం లోని మౌలిక సదుపాయాలను దెబ్బతీయాలని చూస్తున్నరన్నారు. లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా మతపరమైన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని ఇందులో భాగంగానే ఎన్‌ సి ఆర్‌ పి టెక్స్ట్‌ బుక్స్‌ లో మొగలయుల చరిత్ర తీసి వేయడం అన్నారు .పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటాయని కానీ బిజెపి మాత్రం ఇందుకు అంగీకరించడం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలను మింగేసేలా బిజెపి వ్యవహార శైలి ఉందని కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందిరాగాంధీ హాయంలో కూడా రాజ్యాంగం ఉల్లంఘన జరిగిన సందర్భాలు ఉన్నాయని,రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పటి పరిస్థితులకు బిన్నంగా యమర్జెన్సి విధించారని దీంతో అప్పటి ప్రతి పక్ష,పార్టీలు ప్రజలు ఐక్యంగా నిలబడి అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆమెకు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు.లౌకికతత్వానికి , ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిన ప్రతి సారి ప్రజలే తీర్పు చెప్తారన్నారు. భారత ప్రజల చైతన్యవంతులని భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటారని అనేక భాషలు అనేక సంస్కఅతులు అనేక సాంప్రదాయాలు అనేక జాతులు ఉన్న ఈ దేశంలో ఏ మతం ఉన్మాదంగా పనిచేయదన్నారు. పాకిస్తాన్‌ లాగా మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రజలు అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తారని ఈ సదస్సు ద్వారా ప్రజలకి పిలుపు నిచ్చారు. అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అనుసరిస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కొడాలి శర్మ , ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యదర్శి జి కిషోర్‌ కుమార్‌ , ఆల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆర్‌ వెంకటరావు సిఐటియు జిల్లా నాయకులు బూర సుబ్రహ్మణ్యం కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మిరియాల ఆనంద్‌ బెనర్జీ, పెటేటి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర రాజు, విల్సన్‌ పట్టణ కమిటీ సభ్యులు బండి రమేష్‌ , సాలా నాగరాజు, బాబురావు, శరత్‌ కుమార్‌ , తదితరులు పాల్గొన్నారు.

➡️