వార్షిక కళ్యాణోత్సవంపై ఇఒ సమీక్ష

Apr 10,2024 23:40
అన్నవరం సత్యనారాయణ

ప్రజాశక్తి – అన్నవరం

అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణోత్సవం ఏర్పాట్లు దేవస్థానం ఇఒ ఎ.రామచంద్ర మోహన్‌ సమీక్ష నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ఈ కళ్యాణ ఉత్సవాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారం రోజులు పాటు వైదిక పరంగా చేయాల్సిన కార్యక్రమాల్లో ఎటు వంటి లోటు పాట్లు లేకుండా చేయాలని ఆదేశించారు. ఎక్క డైనా లోపం జరిగితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసు కునేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు. ఈ సమా వేశంలో దేవస్థానానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ప్రధాన అర్చకులు, పండితులు పాల్గొన్నారు.

➡️