కెల్‌యులో ప్రారంభమైన ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

Apr 27,2024 00:42

మలోజి అనీ స్పందనకు ధ్రువపత్రాన్ని అందజేస్తున్న కెఎల్‌యు విసి డాక్టర్‌ జి.పార్ధసారదివర్మ, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, కౌన్సెలింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.జగదీష్‌ తదితరులు
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ :
కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీ విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్‌, కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన కెఎల్‌ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వడ్డేశ్వరంలోని వర్శిటీ క్యాంపస్‌లో శుక్రవారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. కెఎల్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన శెట్టిపల్లి జుహి నందన, మలోజి అనీ స్పందనలకు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీటు కేటాయించడంతో పాటు నాలుగేళ్లపాటు నూరుశాతం ఫీజు రాయితీ ఇస్తున్నట్లు ధ్రువపత్రాన్ని అందజేశారు. వీరితోపాటు బొల్లిముంత తేజ్‌ బాలాజీకి ఎఐ అండ్‌ డిఎస్‌లో సీటు కేటాయిస్తూ ధ్రువపత్రాన్ని అందజేశారు. అనంతరం వీసీ డాక్టర్‌ సారధివర్మ మాట్లాడుతూ మెరిట్‌ విద్యార్థులను ప్రోత్సాహించే లక్ష్యంతో మూడు విడతలుగా జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తమ విద్యా సంస్థలో ఇంజినీరింగ్‌, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 26 నుండి 30వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా ఫీజుల్లో రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.జగదీష్‌ మాట్లాడుతూ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. మెరిట్‌ విద్యార్థులకు తాము ఫీజు రాయితీలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థు లకు వచ్చిన ర్యాంకులు, ఇంటర్‌లో వచ్చే మెరిట్‌ మార్కులు, జెఇఇ మెయిన్స్‌ ర్యాం కుల ఆధారంగా వారు కోరుకున్న విభాగా న్ని పొందవచ్చని వివరించారు. కార్యక్రమ ంలో విశ్వవిద్యాలయం ప్రో వైస్‌ చాన్సులర్‌ డాక్టర్‌ ఎన్‌.వెంకట్‌రామ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.శ్రీనివాసరావు, కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.పవన్‌ కుమార్‌, డీన్‌లు పాల్గొన్నారు.

➡️