గాజా ‘పీడకల’కు ముగింపు పలకాలి : ఐరాస చీఫ్‌ విజ్ఞప్తి

Mar 25,2024 09:05 #End, #Gaza, #pleads, #UN Chief

రఫా : ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ విధ్వంసానికి గురైన గాజా గుమ్మం వద్దకు వెళ్లి, రక్తపాతాన్ని ఆపాలని, భయానక క్షామం వైపు నెట్టబడుతున్న గాజాకు మానవతా సహాయాన్ని అందించేందుకు వీలుగా తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. రఫా పట్టణం ఈజిప్షియన్‌ వైపు క్రాసింగ్‌ వద్ద ఆయన శనివారం మట్లాడుతూ రఫా పై భూతల దాడులకు ఇజ్రాయిల్‌ చేస్తున్న యత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనీయులు ఎక్కువ మంది రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. గుటెరస,్‌, ఇతర ప్రపంచ నాయకుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ గాజాను నామరూపాల్లేకుండా చేయాలని ఇజ్రాయిల్‌ చూస్తున్నది. ‘గాజాలోని పాలస్తీనియన్లు ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు అత్యంత దారుణమైన స్థితిని ఎదుర్కొంటున్నారని గుటెర్రెస్‌ పేర్కొన్నారు. ”ఏదైనా తదుపరి దాడి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.”దాదాపు ఆరు నెలలుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న బాంబు దాడుల్లో 32 వేల మందికిపైగా మరణించారు. గాజ నేడు తీవ్ర మానవీయ ా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని గుటెరస్‌ హెచ్చరించినప్పటికీ, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం దాడులతో ముందుకెళ్తామని హూంకరిస్తు న్నారు. .రఫాపై భూతల దాడులకు అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే గాజాలోని పెద్ద భూభాగం శిథిలావస్థకు చేరుకుంది ”గాజాలో ఆకలితో ప్రజలు పెద్దయెత్తున చనిపోతున్నారని” ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్‌ ఓ) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ప్రకటించకపోతే మే నాటికి ఉత్తర గాజాలో తీవ్ర క్షామం నెలకొంటుందని అది హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి సముదాయం అల్‌-షిఫాలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం కూడా దాడులు చేశాయి. . 800 మందికి పైగా పాలస్తీనీయులను అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయిలీ దళాలు నిర్బంధించిన లేదా అరెస్టు చేసినవారిలో ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ నెతన్యాహుతో చర్చించి వెళ్లిన తరువాత దక్షిణ నగరమైన రఫాలోకి ఇజ్రాయిల్‌ దళాలు దూసుకెళ్లడం ప్రారంభించాయి. దీనిని బట్టి అమెరికా అండతోనే ఇజ్రాయిల్‌ రఫాపై భూతల దాడులకు రంకెలు వేస్తోందని అర్థమవుతుంది. బ్లింకెన్‌ మాత్రం రఫాపై భూతల దాడులకు ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా చూడాలని నెతన్యాహుకు తాను సూచించానని చెబుతున్నారు. రఫాపై భూతల దాడులే జరిగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రపంచ నేతలు హెచ్చరిస్తునా్నరు.

➡️