ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 

Feb 14,2024 17:09 #West Godavari District
Employee issues should be resolved immediately

గుడాల హరిబాబు
పాలకొల్లు జేఏసీ అధ్యక్షులు 
ప్రజాశక్తి-పాలకొల్లు : ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు, ఇతర సమస్యలపై సానుకూలమైన పరిష్కారం రానందుకు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బుధవారం పాలకొల్లు జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు అధ్యక్షతన వివిధ సంఘం నాయకులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహశీల్దార్ ఆఫీస్ వద్ద డిప్యూటీ తహసిల్దార్ బి.సీతారత్నంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ జిపిఎఫ్. ఏపీ జిఎల్ఐ, సరెండర్ లీవ్స్, డిఎ ఎరియర్స్, 11వ పిఆర్సి కి సంబంధించిన బకాయిలు నగదు రూపంలో చెల్లించుటకు కాలయాపన జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు అందరిని క్రమబద్ధీకరణ చేయాలని ఇది జాప్యం జరుగుతుందని చెప్పారు. ఇతర సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టవలసి వచ్చిందని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమాలు 20వ తేదీ వరకు జరుగుతాయని 27వ తారీకున చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. యుటిఎఫ్ నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ సొమ్ము తీసుకొనుటకు 2 సంవత్సరాలు అయిన విడుదల చేయకపోవడం ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారని, అలాగే డిఏ ఏరియాస్ బకాయిలు, సరెండర్ లీవ్స్ విడుదల చేయకపోవడం బాధాకరమని ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కన్వీనర్ వేగేశ్న మురళి కృష్ణంరాజు, ఎస్టియు నాయకులు వి ఉదయ్ కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు వి రామ్మోహన్, యుటిఎఫ్ నాయకులు ఎస్ రాంజీ కుమార్, కే త్రినాథ్, సి ఎస్ డిటి ఐ వి.వి సత్యనారాయణ. ఏ ఎస్ ఓ. ఆర్ సుధాకర్. ఏసిటిఓ కే రాజశేఖర్. ఎన్జీవో నాయకులు డివి రమణ, G.బాలచంద్రుడు, ఎస్ కె అమలేశ్వరరావు, తీడ హరిబాబు, ప్రసాదు, తారకసత్య, సిహెచ్ ప్రసాదు, సిటిఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️