పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సు యూనిట్ త్వరలో ప్రారంభం

electric bus unit start soon

ప్రజాశక్తి-పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో పెప్పర్ మోషన్ అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ అతి త్వరలో కంపెనీ పనులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ వారి ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ తో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్న పెప్పర్‌ మోషన్ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి వాతావరణ కాలుష్యం లేకుండా పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమను స్థాపిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ పెప్పర్ మోషన్ కంపెనీ అని ఇది పుంగునూరుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషివలనే కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటుతో ఎవరికి ఎలాంటి ఆందోళనలు ఉండవలసిన అవసరం లేదన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్న తనను నేరుగా కలసి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. కంపెనీ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ హక్కుల చట్ట ప్రకారం వారికి డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఇక్కడ ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరూ సహకరిస్తే పెప్పర్ మోషన్ కంపెనీ త్వరలో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. విలేకరుల సమావేశంలో పలమనేరు ఆర్ డి ఓ మనోజ్ కుమార్ రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, ఎంపిపి భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ సీతారాం, ఎంపిడిఓ నారాయణ, మున్సిపల్ చైర్మన్ హలీం భాష రాష్ట్ర స్టేట్ అండ్ ఫోకల్చరల్ చైర్మన నాగభూషణం తదితరులు పాల్గొన్నారు..

➡️