రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Jan 29,2024 15:08 #Election Commission, #Rajya Sabha

  న్యూఢిల్లీ :   రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులకు ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 15వ తేదీన నామినేషన్లకు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన పూర్తి చేయనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేది ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించగా.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ జరగనున్నట్లు ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్‌లో పది స్థానాలకు, బీహార్‌ 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌లలో ఐదేసి స్థానాల చొప్పున, గుజరాత్‌, కర్ణాటకల్లో నాలుగేసి స్థానాల చొప్పున, ఒడిస్సా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మూడేసి స్థానాల చొప్పున, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

➡️