నిర్లక్ష్యంతోనే త్రాగునీటి సమస్య : సీపీఎం

Mar 25,2024 14:27 #Krishna district

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎన్నికల ముందు ప్రతిరోజు ప్రజలకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు నేడు రెండు రోజులకి ఒకసారి త్రాగు నీరు సరఫరా చేస్తాం అని చెప్పడం వెనుక వారి నిర్లక్ష్య దొరణకి అద్దం పడుతుందని సిపిఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం పేర్కోన్నారు. సోమవారం సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి బూర. సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటివరకు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ “పాలకవర్గ పాలన గురిలేని పిచ్చోడి చేతిలో రాయి లాగా ” సాగిందని విమర్శించారు. పాలకవర్గానికి మంచినీటి సమస్యపై ముందుచూపుతో ఆలోచిస్తే ఈరోజు రెండు రోజులకు ఒకసారి మంచినీరు ఇచ్చే దుస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పటివరకు ఇస్తున్న రోజు విడిచి రోజు ఇచ్చే మంచినీరు కూడా మట్టితో, వాసనతో నిండి ఉంటుందని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పేరుతో నగర పాలక సంస్థలో రాత్రి 9 గంటల వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించే వారికి ఈ విషయం పై చర్చించాలని తెలియదా అని ఎద్దేవా చేశారు. కాబట్టి పాలకవర్గం స్పందించి ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీటిని ప్రతిరోజూ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే టిడ్కో కాలనీ 80% పైబడి పూర్తయిన కాలనీ గత ఐదు సంవత్సరాల నుంచి నిర్మాణం చేస్తున్న పేరుతో కాలయాపన చేసి ఈరోజు కాలనీవాసులకు స్ట్రీట్ లైట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం సరైంది కాదన్నారు, టిట్కో కాలనీ వాసులకు వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. జి ప్లస్ త్రీ టిడ్కో లబ్ధిదారులకు సంబంధించి అనేకమంది అప్పులు చేసి పాతికవేలు, 50 వేల రూపాయలు మున్సిపాలిటీకి డీడీలు కట్టటం జరిగిందని, నిర్మాణ పేరుతో వారిని లబ్ధిదారు లిస్టులో నుంచి తీసివేయడం జరిగిందని వారికి డి. డి. అమౌంట్ ఈరోజు వరకు అందించలేని పరిస్థితిని, వెంటనే వారు కట్టిన నగదును వారికి అందించాలని డిమాండ్ చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ కొడాలి శర్మ మాట్లాడుతూ బందరు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మంచి నీటి సరఫరాలొ శాశ్వత పరిష్కారం చూపాలని, విజయవాడ నది నుండి పైప్లైన్ ద్వారా మచిలీపట్నానికి సరఫరా తీసుకొచ్చి ప్రజలకు అందించాలని సిపిఎం పార్టీగా ఆనాటి నుండి డిమాండ్ చేస్తున్నాదని గుర్తు చేశారు. ఇప్పటికైనా పాలకవర్గం వెంటనే స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించి, రోజు మంచినీరు అందించాలని పాలకవర్గానన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు సి హెచ్ జయరావు , ఎం డి యునస్,ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి ఎం ఎస్.నారాయణ లు పాల్గొన్నారు.

➡️