ఏప్రిల్ రెండో వారం నుండి రోజు విడిచి రోజు త్రాగు నీరు

Apr 4,2024 15:57 #drinking water, #Kurnool

ప్రజాశక్తి కర్నూలు – కార్పొరేషన్ :  ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కర్నూల్ నగర ప్రజలకు ఏప్రిల్ రెండవ వారం నుండి రోజు విడిచి రోజు త్రాగునీరును అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భార్గవ్ తేజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సుంకేసుల రిజర్వాయర్లో నీరు అడుగంటి పోయాయి. ప్రస్తుతం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు నుండి త్రాగునీరు కే బి సి కెనాల్ ద్వారా తీసుకు రావడం వలన ప్రతిరోజు సరిపడా నీరు అందించలేమని ఏప్రిల్ రెండో వారం నుండి నగరంలోని 52 వార్డులకు రోజు విడిచి రోజు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కావున నగర ప్రజలు త్రాగునీటిని పొదుపుగా వాడుకొని నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని కోరారు.

➡️