రబీ పంటల ఈక్రాప్ చేయించుకోండి

Dec 10,2023 00:08

ప్రజాశక్తి – పంగులూరు
రబీ సీజన్లో అక్టోబర్ 10నుండి సాగుచేసిన అన్ని రకాల పంటలను ఈక్రాప్ చేయించుకోవాలని ఎఒసుబ్బారెడ్డి రైతులకు సూచించారు. తుపాను కారణంగా జె పంగులూరు మండలంలో దెబ్బతిన్న మొక్కజొన్న, శనగ, మిర్చి, పొగాకు, మినుము పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన, ఉచిత పంటల భీమా వర్తింపజేయాలన్నా, పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా, సున్నా వడ్డీ రాయితీ పొందాలన్నా తప్పనిసరిగా ఈక్రాప్ నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట సాగు చేసిన రైతులు రైతు భరోసా కేంద్రాధికారులను సంప్రదించి వెంటనే పంట నమోదు చేసుకోవాలని కోరారు.

➡️