షుటింగ్‌ కోసం దారి మళ్లింపు.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ జామ్‌

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తమిళ్‌ హీరో ధనుష్‌ నటిస్తోన్న.. వెబ్‌ సిరీస్‌ షుటింగ్‌ను మంగళవారం ఉదయం తిరుమలకి వెళ్లే ప్రధాన రహదారి అలిపిరి సమీపంలోని శ్రీ బాలాజీ లింకు బస్టాండ్‌, వద్ద నిర్వహిస్తున్నారు. దీంతో తిరుమలకు వెళ్లే యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తిరుమలకు వెళ్లే వాహనాలను ఇస్కాన్‌ మార్గం, టీటీడీ గోడౌన్‌, రూయ ఆస్పత్రి, బధిర హాస్టల్‌ మీదగా దారి మళ్ళించారు. చిత్తూరు బెంగళూరు మదనపల్లి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు కూడా ఇదే ప్రధాన రహదారి కావడంతో సుమారు అర కిలోమీటర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి షుటింగ్‌ ప్రారంభం కావడంతో 8, 9 గంటల మధ్య స్విమ్స్‌, రుయా, మేటర్నాటి, బర్డ్డ్‌, కార్పొరేషన్‌ కార్యాలయం, ఎస్బిఐ ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హృదయాలయ ఆసుపత్రి, భారతీయ విద్యాభవన్‌, ఎస్వీ మెడికల్‌ కళాశాల, ఎస్వీ యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ, సంస్కృత యూనివర్సిటీ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు రోగులు వారి సహాయకులు ట్రాఫిక్‌ జాముల ఇరుక్కుని తీవ్ర అవస్థలు పడ్డారు. పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా, ఉన్న పలంగా ట్రాఫిక్‌ మళ్ళించడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తీరు మార్చుకోవాలని ఎంతో పలికారు. నిరసనాలకు ఆందోళనలకు ఇతరత్రా వాటికి నిషేధ ప్రాంతమైన అలిపిరి మార్గంలో షుటింగుకు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సబబు ప్రజలు బహిరంగనే విమర్శించడం గమనార్హం.

➡️