గొనసపూడిలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు

Jan 13,2024 00:45

ప్రజాశక్తి – ఇంకొల్లు
బాపట్ల పార్లమెంటరీ టిడిపి, వాణిజ్య విభాగపు ఆధ్వర్యంలో చిన్నగంజాం మండలం గోనాసపుడిలో భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు ఈనెల 14న భోగి పండుగ సందర్భంగా నిర్వహిస్తుట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రథమ బహుమతి రూ.55555, 2వ బహుమతి రూ.25,555 ఇద్దరికి, 3వ బహుమతి రూ.10,555ముగ్గురికి ఇవ్వనున్నట్లు వాణిజ్య విభాగం కార్యదర్శి కొండ్రగుంట హరిబాబు తెలిపారు. ఈ పోటీల్లో జిల్లాలోని మహిళలు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. పోటీలో పాల్గొనేవారికి సహాయకులుగా ఒక మనిషిని మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. ముగ్గులకు అవసరమైన రంగులు, సామాగ్రి తెచ్చుకోవాలని తెలిపారు. ఆసక్తికి కలిగిన వాళ్లు 13సాయంత్రం ఐదు గంటల్లోపు పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ఇంకొల్లు, కడవకుదురు, చీరాల మీదుగా గొనసపూడి రావచ్చని తెలిపారు. వివరములకు 9849083710 నార్నె సత్యనారాయణ, 97043235080 విజయలక్ష్మిని సంప్రదించాలని చిన్నగంజాం మండల టిడిపి అధ్యక్షులు పొద వీరయ్య తెలిపారు.
నాగులుప్పలపాడు : మండలంలోని ఉప్పుగుండూరులో సంతూరు సహకారంలో వాసవీక్లబ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆద్వర్యంలో నాగులుప్పలపాడు, కొరిశపాడు, చిన్నగంజాం, ఇంకొల్లు మండలాల స్దాయిలో ముగ్గుల పొటీలు శుక్రవారం నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ఉపాదక్షులు కొంజేటి వెంకట సురేష్ బాబు, అమరా వేణు, సుబ్బారావు, సంతూరు కంపెనీ ప్రతినిదులు పాల్గొన్నారు.

➡️