విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి

Jan 31,2024 10:51 #Chittoor District, #current shok, #died
died by current shock
  • మరొకరికి తీవ్ర గాయాలు
  • సదుం వైద్యశాలకు తరలింపు

ప్రజాశక్తి-సోమల : విద్యుత్ ఘాతానికి గురై నవ వరుడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే చిత్తూరు జిల్లా సోమల మండలం దేవల కుప్పం వద్ద ఉన్న యానాది వాడకు చెందిన పలువురు తమ గొర్రెలను మేత కోసం మంగళవారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకున్నాక కొన్ని గొర్రెలు కనిపించలేదు. ఈ క్రమంలో గొర్రెలను వెతకడానికి ముగ్గురు గ్రామస్తులు గంగాధరం, సిద్దప్ప, ఈశ్వరయ్యలు కలిసి అడవి మార్గంలో వెళ్లారు. వెళుతున్న దారిలో కొందరు రైతులు అడవి పందుల వేట కోసం విద్యుత్ వైర్లు లాగారు. ఇది గమనించని యానాదులు చీకటిలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. గంగాధర (20)సంఘటన స్థలంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం ఇతనికి వివాహమైనది. అలాగే అతనిని కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప (30) తీవ్ర గాయాలతో పడిపోయాడు. ఇతనిని సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. గ్రామానికి చెరుకున్న ఈశ్వరయ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు గాయాల పాలైన సిద్ధప్పను మొదట పెద్ద ఉప్పర పల్లి వైద్య వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధప్పను సదుం వైద్యశాల నుండి పెద్ద ఉప్పరపల్లె హాస్పిటల్ కు తరలించారు.  విషయం తెలుసుకున్న భార్య, అతని బంధువులు మృతదేహం వద్దకు చేరుకొని విలపిస్తున్నారు.

➡️