ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా, ర్యాలీ

Feb 20,2024 16:57 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఎపిజేఎసి పిలుపు మేరకు మంగళవారం కాకినాడ ధర్నా చౌక్ లో జిల్లా జె.ఎ.సి అధ్యర్యంలో మహా ధర్నా, ర్యాలి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎ.పి.జే.ఎ.సి ఛైర్మన్ గుద్దటి రామ్ మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావలసిన ఎస్ఎల్, జిపిఎఫ్ లోన్స్,డీఏ తదితర బకాయిలు అన్నీ వెంటనే విడుదల చేయాలని 12వ పీఆర్సీ 30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.జే.ఎ.సి కన్వీనర్ డి.వి. రాఘవులు ఏపీఎన్జీవో సహాయ జిల్లా కార్యదర్శి పేపకయల వెంకట కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసు, జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ సంఘం అధ్యక్షుడు పాము శ్రీనివాస్, జడ్పీ సంఘం అధ్యక్షుడు ఆర్వీ రమేష్, టీచర్ సంఘాల నాయకులు ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మోర్త శ్రీనివాస్, బి. మహేష్, ఎస్టీయూ కోనసీమ జిల్లా దొరబాబు . యూటీఎఫ్ నుండి కె. నగేష్, గోవింద రాజులు, తానీషా, గిరిధర్, పిఆర్టియూ నుండి ప్రతీప్ జిల్లా ఏపీఎన్జీవో సంఘం ప్రతినిధులు సహా అధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తి బాబు, సరెల్ల చంద్రరావు, కే.వి.ఎన్.వి.ప్రసాద్ , కార్యనిర్వాహక కార్యదర్శి డి.డేవిడ్ఎలియాజర్, సంయుక్త కార్యదర్శి ఎన్. వీరబాబు, కాకినాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సత్తిరాజు, రామకృష్ణ, స్టేట్ కౌన్సిలర్ షేక్ అజీజ్ సీపీఎస్ సంఘ అధ్యక్షుడు బాషా, తదితరులు పాల్గొన్నారు.

➡️