అభివృద్ధి, సంక్షేమం వైసిపితోనే సాధ్యం:’గడికోట’

ప్రజాశక్తి-చిన్నమండెం రాష్ట్రంలో అబివృద్ధి, సంక్షేమం వైసిపితోనే సాధ్యమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నమండెం కలిబండ గ్రామంలో జడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాధరెడ్డితో కలసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలోని కోళ్లవాండ్లపల్లె, నత్తివాండ్లపల్లె, మూలపల్లె, దళిత వాడ కస్పా, మురుగు వాండ్లపల్లె , దళితవాడలలో ఇంటిం టికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మేలును వివరించారు. మరింత అభివద్ధి, సంక్షేమం అందాలంటే జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా, అన్ని ప్రాంతాల అభివద్దే లక్ష్యంగా ఐదేళ్ల పాటు పాలన అందించిన జగన్‌ సంక్షేమ పాలనకు జనం జేజేలు పలుకుతున్నారని కొనియాడారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి నీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2019 నుంచి జగనన్న ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో మార్పులు తీసుకు వచ్చిందన్నారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి, ఇంటి వద్దనే పింఛన్‌ దారులకు పింఛన్‌ అందించారన్నారు. బిసిలంటే బ్యాక్‌ బోన్‌ కాస్ట్‌ అని, బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, బిసిలంటే బ్యాక్‌ బోన్‌ లాంటి వారని సిఎం నిరూపించారని అన్నారు. వైసిపి పాలనలో తమకు నేరుగా ఎవ్వరి సిపారసు లేకుండానే సంక్షేమ పథకాలు అందుతున్నాయని దళితులు చెబుతున్నారని, దళిత పక్షపాతి ప్రభుత్వంగా పేరుగడించామని అన్నారు. మహిళలకు చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను మాపీ చేశారని, చేయూత పథకం ద్వారా తమ ఆర్థికాభివద్దికి చేయూతనందించారని తెలిపారు. కార్యక్రమంలో తన వెంట మండల వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు బాబు రెడ్డి,సింగల్‌ విండో అధ్య క్షుడు గోవర్దన్‌ రెడ్డి ,సర్పంచ్‌ జగన్నాథరెడ్డి, వెంకట రమణ, ఎంపిటిసి గంగులయ్య, గురివిరెడ్డి,అశోక్‌ రెడ్డి,ఆదిరెడ్డి, ఉప సర్పంచ్‌ రఘునాథ పాల్గొన్నారు.

➡️