ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలి

Mar 11,2024 12:37 #West Godavari District
  • సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
     భీమవరం ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాశక్తి-భీమవరం : ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణ బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. భీమవరం ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలను కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత నాలుగేళ్ళలో అమ్మిన బాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని బహిర్గతం చేయాలన్నారు. ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్‌ అందించాలనీ, ఈసీ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైందని విమర్శించారు. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్‌బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసిందన్నారు.. ఆ వివరాలను వెల్లడిరచడానికి బదులు ఎస్‌బిఐ, గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిరచకుండా వుండేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఎస్బిఐ కార్యకలాపాలన్నింటినీ డిజిటల్కెజ్‌ చేసిందని ఏ వివరాలు కావాలన్న ఒక్క రోజులో ఇవ్వవచ్చుని కాని ఎస్‌బిఐ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కొద్ది రోజుల్లో పొందుపరిచి ఇవ్వలేక పోయిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ళ కారణంగానే ఎస్‌బిఐ తాత్సారం, జాప్యం చేస్తుందని చేస్తుందని ఆరోపించారు. మోడి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రజలపక్షాన పనిచేసేదే అయితే ఎందుకు బయటపెట్టలేకపోతోదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎస్‌బిఐ అందచేసేలా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కర్యాదర్శివర్గ సభ్యులు బి.వాసుదేవరావు, జిల్లాకమిటీ సభ్యులు ఎం.రామాంజనేయులు, ఎం.వైకుంఠరావు, మరియు కార్యకర్తలు ఎం.ఆందజనేయులు, త్రిమూర్తులు, ఒడుగువెంకటేశ్వరరావు, ఇంజేటిశ్రీను, కార్మికులు పాల్గొన్నారు.

➡️