మామిడి, టెంకాయ చెట్లు నరికివేత

Apr 7,2024 22:48
మామిడి, టెంకాయ చెట్లు నరికివేత

భూకబ్జాదారుపై కఠిన చర్యలు తీసుకోవాలిరూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించాలిసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ బంగారుపాళ్యం మండలం 172 మొగిలి వెంకటగిరికి చెందిన సుబ్రహ్మణ్యం, కష్ణయ్య, లోకేశ్వర రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ఉన్న 150 మామిడి చెట్లు, 40 కొబ్బరి చెట్లను అక్రమంగా దౌర్జన్యంగా నరికి వేసిన భూకబ్జాదారు మహేంద్రను వెంటనే అరెస్టు చేసి రైతులు నష్టపోయిన రూ.3 లక్షలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసుకుంటున్న భూమిపై కన్నెవేసిన భూకబ్జాదారులు ప్రధానవ్యక్తి మహేంద్ర అతని అనుచరులు 8 మందిపై చర్యలు తీసుకోవాలని పదేపదే రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఈనష్టం జరిగిందని తెలిపారు. అధికారులతో అండతో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో ఇసుకను తరలిస్తూ, ఎక్కడ కాళీ భూములు కనిపిస్తే అక్కడ ఆక్రమించుకుంటూ పేదలపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై రకరకాల అనుమానాలకు దారితీస్తుంది. రైతులు తోట రక్షణ కోసం చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని ముందుగా ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. ఇంత దౌర్జన్యం చేసిన వారిపై పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.బంగారుపాళ్యం: రైతుల పంటలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ దారుణం జరిగిందని అధికారుల అండతో ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలపాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని లేకుంటే రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

➡️