వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి కత్తిరింపులు

Mar 21,2024 09:55 #Agriculture Sector, #AP Economy

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి బ్యాంకర్లు తయారుచేసిన రుణ ప్రణాళికలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కోతలు పడ్డాయి. దీనిని శుక్రవారం జరిగే కీలక సమావేశంలో ఆమోదించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 4,43,000 కోట్లకు రుణ ప్రణాళికను ఆమోదిరచగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో 5,25,000 కోట్లకు ఖరారు చేశారు. అంటే మొత్తం 19 శాతం వృద్ధి ఉన్నట్లు పేర్కొన్నా రు. అయితే వ్యవసాయ రంగంలోని యాంత్రీ కరణకు గతేడాది మూడు వేల కోట్లు ఖరారు చేయగా, ప్రస్తుతం 1,200 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. దీనివల్ల ఏకంగా 60 శాతం ఈ రంగానికి కోత పడింది. పాడి అభివృద్ధికి గతేడాది తొమ్మిది వేల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 61 శాతం కోతలతో 3,500 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వ్యవసాయ మౌళికాభివృద్ధి, ప్రధానమంత్రి ఆవాస యోజన, ఎగుమతుల రుణాలు, సామాజిక మౌళికాభివృద్ధి, పునరుత్పాక విద్యుత్‌ రంగాలకు కూడా రుణ కేటాయింపులు పెంచలేదు.

విడుదల కాని రుణాలు
గత ఏడాది ఖరారు చేసిన 4.43 లక్షల కోట్ల రుణ ప్రణాళికలో డిసెంబర్‌ వరకు 108 శాతం అధికంగా లక్ష్యాన్ని సాధించారు. ఇందులో కూడా వ్యవసాయ మౌళికాభివృద్ధి రంగంలో 60 శాతం తక్కువగా లక్ష్యాన్ని సాధించారు. మూడు వేల కోట్ల రుణ ప్రణాళికలో కేవలం 795 కోట్లు మాత్రమే లక్ష్యాన్ని సాధించడం విశేషం. ఎగుమతులకు ఇచ్చే రుణంలో కూడా70 శాతం, గృహ నిర్మాణాలకు ఇచ్చే రుణాల్లో 45 శాతం, సామాజిక మౌళికాభివృద్ధిలో 53 శాతం, పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో 62 శాతం, ఇతర రంగాల్లో 75 శాతం తక్కువగా లక్ష్యాన్ని సాధించినట్లు తేలిరది. అయితే ఆయా రంగాల్లో కేటాయిరచిన రుణాలను లబ్దిదారులు వినియోగించు కోలేకపోయారా, లేక బ్యాంకుల నురచి రుణాలు విడుదల కాలేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. గతేడాది తక్కువ లక్ష్యాన్ని సాధిరచిన రంగాలకు ఈ ఏడాది కేటాయింపులు తగ్గించి చూపించినట్లు కనిపిస్తోంది.

➡️