సభ్యత – సంస్కారం

Apr 17,2024 05:09 #feachers, #jeevana, #Kavitha

ఇచ్చి పుచ్చుకోవడం
దయతోని మెలగటం
తోటివారితో స్నేహం
ఇదే కదా సంస్కారం!
ఇదే కదా సభ్యత!

సఖ్యతగా మెలగటం
పెద్దల యెడ గౌరవం
ప్రేమను చూపించటం
ఇదే కదా సంస్కారం!
ఇదే కదా సభ్యత!

సౌమ్యత కలిగుండటం
మర్యాదతో మెలగటం
కటువుగా లేకుండటం
ఇదే కదా సంస్కారం
ఇదే కదా సభ్యత!

వినయంగా ఉండటం
అణకువగా మసలటం
సానుకూల దక్పథం
ఇదే కదా సంస్కారం!
ఇదే కదా సభ్యత!

సాయం అందించటం
దేశభక్తి నేర్వటం
బాధ్యతగా మెలగటం
ఇదే ఇదే సంస్కారం!
ఇదే ఇదే సభ్యత!

మానవతా దృక్పథం
మొరటు లేకుండటం
మమత పూయించటం
ఇదే ఇదే సంస్కారం!
ఇదే కదా సభ్యత !

– రావిపల్లి వాసుదేవరావు,
94417 13136.

➡️