విశాఖలో భవన నిర్మాణ కార్మికుల నిరసన

విశాఖ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ …. భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు నర్సింగరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సింగ్‌ హౌటల్‌ జంక్షన్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపారు.

నేతలు మాట్లాడుతూ … రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28, 29 నిరసన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని దానిలో భాగంగానే ఈరోజు సింగ్‌ హౌటల్‌ జంక్షన్‌ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులు జనార్దన్‌ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశామన్నారు, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.సుబ్బారావు మాట్లాడుతూ … భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని.. దశాబ్దాల పాటు ఇది భవనిర్మాణ కార్మికులకు ఉపయోగంగా ఉందని అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధిని పూర్తిగా ఖాళీ చేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమం ద్వారా రావలసిన పథకాలు అవి కూడా పెండింగ్‌లో ఉన్నాయని దీని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు జగదాంబ జోన్‌ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ … ఈ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆదిలోనే ఇసుక మాఫియా అని పేరు చెప్పి ఇసుకను అందించకుండా చేశారని అలాగే సిమెంటు ఐరన్‌ ఈ పిక్క ఇలాంటి రేట్లు విపరీతంగా పెరిగిపోయి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేశారని చెప్పారు. కరోనాకాలంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి రాలేదని అన్నారు. మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ … భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధఅతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, శ్రీను నాయుడు, సిమ్మన్న, పార్వతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

➡️