అకాల వర్షంతో అవస్థలు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొక్కజొన్నకు నష్టం
ఏలూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి
ప్రజాశక్తి- యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. అకాల వర్షాలతో మొక్కజొన్నకు శ్రీకాకుళం జిల్లాలో భారీగా, విజయనగరం జిల్లాలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. మామిడి కాయలు నేలరాలాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వర్షం వస్తుండటంతో గడ్డివాము తడవ కూడా పరదా కప్పడానికి వెళ్లిన ఏలూరు శివార్లలోని చొదిమెళ్ల గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ (45) పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం నుంచి మిగతా 5లో

బుధవారం ఉదయం వరకు 136.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం వి.చిన్నయ్యపేట గ్రామంలో పిడుగు పడి 35 గొర్రెలు మృతి చెందాయి.
శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజన్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 38,163 ఎకరాలు కాగా, లక్ష్యానికి మించి 38,768 ఎకరాల్లో వేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, పాతపట్నం, సారవకోట, జలుమూరు మండలాల్లో అధికంగా, ఆమదాలవలస, జి.సిగడాం, నందిగాం, మెళియాపుట్టి ప్రాంతాల్లో పాక్షికంగా పంట దెబ్బతింది.
మొత్తం 1,100 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఇందులో కోతలు పూర్తయి, పొలాల్లోనే ఉన్న పంట 700 ఎకరాల వరకు ఉన్నట్టు రైతులు చెప్తున్నారు. కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో 400 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు తెలుస్తోంది. జిల్లాకు భారీ వర్షసూచన ఉండడంతో మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కోత కోసి ఆరబెట్టిన పంటలను కళ్లాల్లో ఒక దగ్గరికి చేర్చి టార్ఫాలిన్లతో కప్పుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు మంచి ధర లభిస్తోంది. పంట అమ్మితే కొన్ని అప్పులు తీరుద్దామని ఆశించిన రైతులకు అకాల వర్షాలు శరాఘాతమయ్యాయి.

ఏం చేయాలో పాలుపోవడం లేదు
నేను 2.5 ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. కోతలు కోసి పొలంలోనే ఆరబెట్టాను. పంటంతా తడిసిపోయింది. అప్పు చేసి లక్ష రూపాయల వరకు ఖర్చు చేశాను. వారం రోజుల కిందట గింజల పరిస్థితి చూసేందుకు వ్యాపారులు వచ్చారు. ఇప్పుడు వర్షానికి గింజలు పూర్తిగా దెబ్బతినడంతో ఇంకెవరు తీసుకుంటారు.
– విజయ్ కుమార్‌ మహాపాత్రో, ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా)

ఎకరాకు రూ.80 వేలు నష్టం
వర్షాల వల్ల నష్టపోయాము. ఏటా ఈ ప్రాంతంలో సారి కంద వేస్తాము. మొక్కజొన్నకు ధర బాగుందని ఈ సంవత్సరం చాలామందిమి ఈ పంట వైపు మొగ్గు చూపాము. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక క్వింటాలు రూ.2 వేలు ధర పలుకుతోంది. ఈ ఏడాది ఎకరాకు 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. అకాల వర్షాల వల్ల ఎకరాకు రూ.80 వేల చొప్పున నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– వి.తిరుమలరావు, ఎల్‌ఎన్‌పేట

– విజరుకుమార్‌ మహాపాత్రో, ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా)

ఎకరాకు రూ.80 వేలు నష్టం
వర్షాల వల్ల నష్టపోయాము. ఏటా ఈ ప్రాంతంలో సారి కంద వేస్తాము. మొక్కజొన్నకు ధర బాగుందని ఈ సంవత్సరం చాలామందిమి ఈ పంట వైపు మొగ్గు చూపాము. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక క్వింటాలు రూ.2 వేలు ధర పలుకుతోంది. ఈ ఏడాది ఎకరాకు 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. అకాల వర్షాల వల్ల ఎకరాకు రూ.80 వేల చొప్పున నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– వి.తిరుమలరావు, ఎల్‌ఎన్‌పేట (శ్రీకాకుళం జిల్లా)

➡️