తుఫాన్ హెచ్చరికతో వరి రైతుల్లో ఆందోళన

Dec 3,2023 23:35

ప్రజాశక్తి – కొల్లూరు
మండలంలోని చుట్టు ప్రక్కల గ్రామాల్లో వరి కోతలు కోశారు. కోతలు కోసిన వరి బోదెలు పొలంలోనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తుఫాను హెచ్చరికలు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు వర్షాలు లేక వరి పంటని పండించడానికి రైతులు చాలా వ్యయ ప్రయాసలు పడ్డారు. తీరా పంట పండించి చేతికొందే దశలో వర్షాలు ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక కాలవల నుండి నీళ్లు రాక రైతులు చాలా కష్టాలు పడి బోర్ల నీళ్లు పెట్టుకుని ఒక ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చు చేసి పండించిన పంట నోటి దగ్గరకు వచ్చే సమయానికి తుఫాను ప్రభావంతో ఎక్కడ నేలపాలు అవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోత కోసిన పొలాలు భారీ వర్షాలు పడితే ఓదెలు మునిగిపోయి వడ్లు ఎక్కడ మొలకొస్తాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం వలన వరి కుప్పలు వేస్తున్నారు. ఓదులు ఎండకుండా కుప్పలు వేస్తే కుప్పలోపల వడ్లు రంగు మారి పాడవుతాయేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️