చిన్నారులకు పోటీలు

Jan 15,2024 00:17

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
స్థానిక శ్రీ శాంతినికేతన్ రోడ్డులో ఆవులమంద సుబ్బయ్య మాస్టర్ ఇంటి వద్ద శ్రీ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు వేసి ఆటపాటలతో అలరించారు. భోగి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, కుర్చీల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆవులమంద సుబ్బయ్య, రామకృష్ణ, కిరణ్‌ పాల్గొన్నారు.

➡️