తీరప్రాంత అభివృద్ధే లక్ష్యం – కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాల

Jan 5,2024 08:57 #minister purushotham, #speech

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా):దేశంలో ఉన్న సాగర తీరప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల అన్నారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లోని రామన్నపాలెం వద్ద నిర్మిస్తున్న హార్బర్‌ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. సాగర్‌ పరిక్రమ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని సాగర తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి, హార్బర్ల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. కాకినాడ తీరంలో హార్బర్‌ నిర్మాణం వేగవంతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాంతాలు వేరైనా సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితులు, సమస్యలు ఒకేలా ఉంటాయని, రాబోయే రోజుల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలో పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతామని తెలిపారు. కాకినాడ ఎంపి వంగా గీతా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరప్రాంత అభివృద్ధికి నిరంతరం కఅషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పాల్గొన్నారు.

➡️