ఆస్ట్రేలియా లిథియం గనులపై కోల్‌ ఇండియా దృష్టి

Feb 19,2024 21:18 #Business, #coal india

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని లిథియం గనులపై దృష్టి పెట్టామని ప్రభుత్వ రంగంలోని కోల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పిఎం ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం ఆ దేశంతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము 780 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరనున్నామన్నారు. ఈ నెల చివరి వారంలో భారత గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించనున్నట్లు పలు మినరల్‌ గనుల వేలంలో కోల్‌ ఇండియా మూడు బిడ్డింగ్‌లు వేయనుందన్నారు. ఆస్ట్రేలియాలోని లిథియం, నికెల్‌ మైన్లను పొందడానికి ఫిబ్రవరి 26న జరగనున్న బిడ్డింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

➡️