నటుడు ప్రకాష్‌రాజ్‌కు క్లీన్‌చిట్‌

prakash raj clean chit

పొంజి స్కామ్‌తో ఆయనకు సంబంధం లేదన్న ఇడి

న్యూఢిల్లీ : తమిళనాడులోని ప్రణవి జ్యువెల్లర్స్‌కు సంబంధమున్న రూ.100 కోట్ల విలువైన పొంజి స్కామ్‌ కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదని వెల్లడించింది. ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌కు ప్రకాశ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇడి క్లీన్‌చిట్‌ అనంతరం నటుడు ప్రకాష్‌రాజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ”తమిళం అర్థం కానివారి కోసం బ్రేకింగ్‌ న్యూస్‌. దర్యాప్తు బృందం అధికారిక ప్రకటన. తమిళనాడు ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌కు చెందిన పొంజి స్కామ్‌లో ఆయనకు సంబంధం లేదు. నన్ను నమ్మి, నా వెంట నిలబడ్డ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ సత్యమేవజయతే, జస్ట్‌ ఆస్కింగ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఆయన తన పోస్ట్‌ను ముగించారు. తన ఎక్స్‌ పోస్ట్‌కు తమిళ వార్తా ఛానెల్‌కు చెందిన ఒక క్లిప్‌ను ఆయన జోడించారు.

➡️