నగర పాలక సంస్థ ఆదాయానికి గండి

Feb 18,2024 11:43 #Vizianagaram
City government is a source of revenue

ఇష్టారాజ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్ కోచింగ్ నెట్ కేంద్రాలు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కాదేది డబ్బులు సంపాదించడానికి అనర్హం అన్నా రీతిలో విజయనగరం పట్టణంలో బ్యాడ్మింటన్, క్రికెట్ కోచింగ్ నెట్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. రోజూ రోజుకి ఆరోగ్యంపై దృష్టి సారించడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలల్లో శారీరక వ్యాయామాలు లేకపోవడంతో పిల్లలని ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామ సాలల్లో, క్రికెట్ కోచింగ్ సెంటర్లులో, గేమ్స్ నేరో కేంద్రాల్లో చేర్పిస్తున్నరు. క్రికెట్ కు, బ్యాడ్మింటన్ క్రీడలకు ఆదరణ ఉండటంతో పాటు పిల్లలు క్రికెట్ క్రీడపై మక్కువ చూపిస్తూనుండటంతో ఎక్కువమంది తల్లి తండ్రులు పిల్లలని క్రికెట్ సాధన కోసం కోచింగ్ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. క్రికెట్ మైదానాలు, బ్యాడ్మింటన్ లో అసోసియేషన్ తరుఫునా కోచింగ్ ఇస్తు ఉండటం అందులో కొద్ది మందికి అవకాశం ఉండటం తో ఆట స్థలాలు, ఇండోర్ స్టేడియంలు లేకపోవడంతో నెట్ కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. క్రీడలు సాధనకు పెద్ద మైదానాలు, ఇండోర్ స్టేడియంలు ఉండాలి.
అటువంటిది ఏమి లేకుండా కేవలం 300 నుంచి 500 గజాలు స్థలం ఉంటే చాలు ఆ స్థలంలో చుట్టూ నెట్ లు కట్టి కేవలం పిచ్ కు సరిపడే స్థలంలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వంత స్థలంలో కొంతమంది ఏర్పాటు చేస్తే మరీ కొంతమంది స్థలాలు లీజుకు తీసుకుని నెట్ లు కట్టి కోచింగ్ సెంటర్లు గా మారుస్తున్నారు. ఇళ్లకు కొంతమంది ఇంటి పై భాగంలో నెట్ లు కట్టి వాటిని కోచింగ్ సెంటర్లు గా మారుస్తున్నారు. నగరంలో సుమారుగా 25 వరకు ఇటువంటి కేంద్రాలు వేలసాయి.

అత్యధిక ఫీజులు వసూలు..
మరో వైపు శారీరక వ్యాయామాలు కోసం పిల్లల్ని చేరాయిస్తున్న తల్లి తండ్రులు ఎంత డబ్బులు చెల్లించేందుకు వెనుకాడటం లేదు.ఇదే అదునుగా కోచింగ్ సెంటర్లు క్రికెట్ కు ఒక విద్యార్ది నుంచి 500 నుంచి 1000, బ్యాడ్మింటన్ కు 1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు క్రీడా సామగ్రి తెప్పించి కోచింగ్ నిర్వాహకులు అమ్మడం ద్వారా కూడా భారీ ఆదాయం సంపాదిస్తున్నారు.

లక్షల్లో నగర పాలక సంస్థ ఆదాయానికి గండి.
నగర పాలక సంస్థ అనుమతి లేకుండా ఎటువంటి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేకెండ్ టాక్స్ కట్టాల్సి ఉంది. అదే విధంగా కోచింగ్ ప్రచారం కోసం పెట్టే బోర్డులను కూడా ఎడ్వటేజ్మెంట్ పన్ను కట్టాల్సి ఉంది. వీటితో పాటు ముందుగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది.
ఇవేవీ చెల్లించకుండా నగర పాలక సంస్థ కు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. మరో వైపు విచ్చలవిడిగా ఇటువంటి శిక్షణ కేంద్రాలు నగరంలో పుట్టుకొస్తుంటే కనీసం వాటి గురుంచి నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం వలన నగర పాలక సంస్థ కు రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. ఇదే నిర్లక్ష్య వైఖరి కొనసాగితే నగరంలో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నగర పాలక సంస్థ అధికారులు, పాలకులు స్పందించక పోతే విచ్చలవిడిగా పెరిగే అవకాశం ఉంది, ఆదాయానికి గండి పడే అవకాశాలు ఉన్నాయి.

➡️