ప్రాంగణ ఎంపికల్లో 30 మంది ఎంపిక

Mar 16,2024 12:41 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో శనివారం సైంటిఫిక్ ఎర్నివా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో సుమారు 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.స్వర్ణలత తెలియజేశారు. కంపెనీ ఉపాధ్యక్షులు నవీన్, సీనియర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రశాంతి, టీం లీడ్ కావ్య, నితీష్ ల ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పరీక్ష, బృంద చర్చ, టెక్నికల్ రౌండ్ నిర్వహించి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. సుమారు 90 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 36 మంది ఎంపికయ్యారని, వీరిలో బీఫార్మసీ అర్హతతో ఉద్యోగాన్ని పొందిన విద్యార్థులకు సుమారు రూ 2.3 లక్షలు వార్షిక వేతనం, ఎం ఫార్మసీ అర్హతతో ఉద్యోగం పొందిన వారికి రూ 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని ప్రిన్సిపల్ స్వర్ణలత తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం వైస్ చైర్మన్ ఎల్లారెడ్డి, కోశాధికారి అభిషేక్ రెడ్డి, కార్యదర్శి గంగిరెడ్డి, చైర్మన్ రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.ద్వారకనాథ్ రెడ్డి, నరసింహులు, డాక్టర్ ఎం.శిరీష, డాక్టర్ ఎం.హంస బేగ్, మహేంద్ర, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️