బాల్యం

Feb 18,2024 08:54 #Sneha

కష్టాలు తెలియని వయసు

ఎప్పుడూ సంతోషంగా ఉండే మనసు

అల్లరిలో వేసే చిందులు

అమ్మమ్మల నీతి కథలు

వేసవిలో మామిడికాయ

తీపి జ్ఞాపకాలు మోసేది గుండెకాయ

తండ్రి చేతిలో మందలింపు

తల్లి చేతిలో లాలింపు

అన్నాచెల్లెళ్ల మధ్య ఉండేది ప్రేమ

చుక్కల మధ్య ఉండేది చందమామ

మిత్రులతో కలిసి వెళ్ళేది విహారయాత్ర

జ్వరం వస్తే మింగేది ఇంగ్లీషు మాత్ర

ఓ చిన్ని జీవితం…

అందులో మరువలేనిది నా బాల్యం

– ఎం.లిఖిత, 10వ తరగతి, అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి .

➡️