మలబద్ధకానికి చెక్‌ పెట్టండిలా …

Feb 19,2024 11:04 #health

ప్రస్తుత జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు … ఇలా అనేక రకాల కారణాలతో చాలామంది మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనిని మొదట్లోనే నియంత్రించాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధిగా మారే ప్రమాదం ఉంటుంది. మూలశంఖ, ప్రేగు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం తినే ఆహారంలో సరైన కేలరీలు, పైబర్‌, పోషకాలు లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ శరీరానికి అవసరమైన మంచినీటిని తాగకపోవటం, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఏర్పడవచ్చు. మలబద్ధకం సమస్య వస్తే దాని వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్‌, అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. బాత్రూమ్‌ వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నా, పొడిగా వస్తున్నా, గట్టిగా వస్తున్నా, వెళ్లే చోట నొప్పి పుడుతున్నా, పూర్తిగా విసర్జన చేయలేక ఇబ్బంది పడుతున్నా కూడా మలబద్ధకం సమస్యగానే చూడాలి. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. తద్వారా ఈ సమస్య నుంచి కొంతవరకూ బయట పడే అవకాశం ఉంటుంది.

అరటి పండ్లు : మలబద్ధకం సమస్య తగ్గించటంలో ఇవి బాగా దోహదపడతాయి. అరటిలో ఉండే పీచు పదార్థం మల బద్ధకాన్ని నివారిస్తుంది. జీవ పక్రియను, పేగు కదలికలను సులభతరం చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. క్రమం తప్పకుండా రోజూ ఒక అరటిపండు తినటం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చు. జీవపక్రియను, పేగు కదలికలను సులభతరం చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. క్రమం తప్పకుండా రోజూ ఒక అరటి పండు తినడం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అరటి పండును తీసుకోవచ్చు.

అంజీర్‌ : వీటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌ కంటెంట్‌ బాగా ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యంతోపాటుగా మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇవి పేగు కదలికలను మెరుగుపరచి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి సహాయపడుతుంది.

కివి ఫ్రూట్‌ : వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌సి, రోగ నిరోధక శక్తి, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్రూట్‌ తిన్నా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

ఆల్‌బకరా : మలబద్ధకం సమస్యను తగ్గించేందుకు ఇవి చక్కగా పనిచేస్తాయి. వీటిలో అధికంగా ఫైబర్‌, ఫైటో న్యూట్రియెంట్లు, సార్భిటాల్‌ ఉంటాయి. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పేగు కదలికలను సులభతరం చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది.

కర్భూజ : ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటును క్రమపరిచి హైపర్‌ టెన్షన్‌ను దూరంగా ఉంచుతుంది. విటమిన్‌ ఎ, బీటా కెరొటిన్‌ దృష్టిని మెరుగుపరచి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. వీటి విత్తనాల్లో ఉండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పొటాషియం పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది. ఈ పండును తినటం వల్ల రక్తంలోని చక్కెరస్థాయిలో స్థిరంగా ఉంటాయి. వీటిలోని విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచు తుంది. తెల్లరక్త కణాల సంఖ్య పెంచి వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కండరాలు, నరాలు రిలాక్స్‌ అయి మంచి నిద్ర పడుతుంది.

మలబద్ధకానికి కారణాలివే..

ఆహారంలో సరైన ఫైబర్‌ లేకపోవటం్డ మైదా, నూనెలో వేయించిన కారంగా ఉండే ఆహారాన్ని తినడం, తక్కువ నీరు తాగడం

సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం

రాత్రిపూట ఆలస్యంగా తినటం

కాఫీ, టీ, పొగాకు లేదా సిగరెట్లను ఎక్కువగా తీసుకోవటం… ఈ అలవాట్లను మార్చుకోవాలి.

➡️