చట్టాలు చేయాలని ఉత్తర్వులివ్వలేం : హైకోర్టు

Mar 14,2024 00:02 #AP HIG, #Cannot order, #make laws

ప్రజాశక్తి – అమరావతి : హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఎపి, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ మేరకు చట్టం చేసేలా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. చట్టాలు చేయాలని కోర్టులు ఉత్తర్వులు ఇవ్వలేవని తేల్చి చెప్పింది. పార్లమెంటు ఏ చట్టాలు చేయాలో కోర్టులు ఆదేశాలు జారీ చేయబోవని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. ఎపి, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల విభజన ఇంకా పూర్తి కానందును మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రం చట్టం చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌ కుమార్‌ వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.

➡️