ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారాలు

Apr 16,2024 23:09
  • సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు

 ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాల వల్ల ధరలు, పన్నుల భారాలతో ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు అన్నారు. 24వ డివిజన్‌ సీతారాంపురం తదితర ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ప్రజలను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల బాండ్ల అవినీతిని ప్రధాని సమర్ధించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్ల నుండి ముడుపులు తీసుకుని బిజెపి, టిడిపి, వైసిపి అవినీతిపరులకు మేలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని చూపి ఓట్లు అడగలేక సానుభూతి రాజకీయాల కోసం వెంపర్లాడుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందని అన్నారు. మోడీతో టిడిపి జత కట్టి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. విజయవాడలో గతంలో టిడిని, నేడు వైసిపి ప్రజాప్రతినిధులు వివిధ రూపాల్లో ప్రజలను కొల్లగొట్టి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రజల ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం సాగించే సిపిఎం, కమ్యూనిస్టులేని, ఓట్లు అడిగే వారికి మాత్రమే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.రమణారావు, కె.సరోజ, వై సుబ్బారావు, పి.వి.ఆంజనేయులు, లక్ష్మణ, మహేష్‌, గురుమూర్తి, మురహరి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

➡️