భారమవుతున్న పశు పోషణ

ప్రజాశక్తి – పులివెందులటౌన్‌ పస్తుతం పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం కోసం తిప్పలు పడుతున్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. రాయితీలు , పథకాలు దూరమయ్యాయి. నిధుల రాకపోవడంతో పథకాల అందడం లేదు. గ్రాసం దొరక్కపోవడంతో గేదెలు బక్కచిక్కి పాల దిగుబడి తగ్గింది. పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేలా గతంలో గోకులం పథకం ఉపాధి హామీ నిధులతో పశువుల క్షేత్రాలను రాయితీలతో నిర్మించారు. కానీ ప్రస్తుతం ఈ పథకాలను నిలిపివేయడంతో రైతుకు మరింత భారం పడుతుంది. రాయితీలపై అందించే పాతర గడ్డిని ఆపేశారు. పైగా పశు నష్టపరిహారం పథకానికి నిధులు నిలిపేసి పలుమార్పులతో బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ప్రీమియం పథకాల అమలు కాక పాడి రైతు ఎదురుచూస్తున్నారు. గతంలో పశువులకు నీడనివ్వడానికి గోకులాలు ఎంతగానో ఉపయోగపడేవి. అలాగే పశుగ్రాసం కోసం గడ్డి విత్తనాలు రాయితీలతో అందించేవారు. పశుగ్రాసం కూడా రాయితీతో గ్రామాలకు చేర్చేవారు. కానీ ఈ పథకాలన్నీ ఆపివేయడంతో పాడి పరిశ్రమ పై ఆధారపడిన వారికి భారం అధికమైంది. పులివెందుల నియోజకవర్గంలో 4290 పాడి రైతులు ఉన్నారు. మండలాల వారీగా చూస్తే చక్రాయపేట 910, లింగాల 650, సింహాద్రిపురం 630, పులివెందుల 530, వేముల 520, తొండూరు 390, వేంపల్లి 660 మంది పాడి పై ఆధారపడి ఉన్నారు. గతంలో రైతులు పసుపు పోషణ కోసం వేరుశనగ , జొన్న, కొర్ర తదితర పంటలు సాగు చేసేవారు. కానీ ఈ పంటల సాగు చేయడానికి ఖర్చులు అధికమవుతుండడంతో వీటిపై రైతులు విముఖత చూపారు. దీంతో పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరగడంతో రైతన్నకు పశువుల పోషణ భారమై పశువులను అమ్ముతున్నారు. కొంతమంది పశువులను, తక్కువ ధరలకు అమ్ముకోలేక మేత కోసం పొలాల గట్టుల్లోకి తోలకపోయి వాటి కడుపు నింపుతున్నారు. ప్రభుత్వం పాల రేటు పెంచిందే తప్ప, పోషణకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. పైగా గతంలో ఇస్తున్న రాయితీలపై కోత విధించడంతో పశు పోషకులకు నష్టం వాటిల్లుతోంది. వ్యవసాయంలో రాబడి తగ్గడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయంగా పశుషోణను ఎంచుకున్నారు, కానీ పశువులను పోషించడానికి కావాల్సిన దాణా ప్రభుత్వం అందించకపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం పాడి రైతుల కష్టాలు గ్రహించి నిధులు కేటాయించకపోతే పాల ఉత్పత్తులు తగ్గి ప్రజలపై కూడా భారం పడే పరిస్థితులున్నాయి.గతంలో ఇలా.. గత టిడిపిప్రభుత్వ హయాంలో పాల ఉత్పత్తి పెంపు నకు ఏటా పశు పోషకులకు పాతర గడ్డి(సైలేజ్‌), దాణాతోపాటు పలు పథకాలు రాయితీపై అందించారు. ఏటా టన్నుల కొద్ది పాతర గడ్డి బేళ్లను నేరుగా గ్రామాల్లోని పశు పోషకులకు అందజేశారు. 75 శాతం రాయితీపై పాతర గడ్డికిలో రూ.2కే సరఫరా చేశారు. దాణా కూడా 75 శాతం రాయితీపై కిలో రూ.4కే సరఫరా చేసే వారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల కింద పశువుల సంరక్షణ షెడ్ల నిమిత్తం గోకులం, మినీ గోకులం నిర్మించారు. ఉపాధి హామీ నిధులతో ఊరూరా పశుగ్రాసం విస్తారంగా సాగు చేయించారు. అధిక సంఖ్యలో రైతులు వేసవిలో పశుగ్రాసం కొరత ఉన్న అన్నీ ప్రాంతాలకు పచ్చగడ్డి సరఫరా చేసి ఆదాయం పొందారు. వేసవి సీజన్లో పొలాలకు వెళ్లిన పశువులకు తాగునీటి సమస్య లేకుండా అందుబాటులో ఉన్న చేతిపంపుల వద్ద నీటి తొట్టెలు నిర్మించారు. 2019లో వైసిపి ప్రభుత్వం వచ్చిన వెం టనే గోకులం, మినీ గోకులం పథకాలను రద్దు చేసింది. వాటిని నిర్మించుకున్న పాడి రైతులకు బిల్లులు నిలిపేసింది. గత ప్రభుత్వ హయాంలో రాయితీపై దాణామతం కిలో రూ.3కే అందిస్తుంటే దాని ధర రూ.6.50 లకు పెంచేసింది.పశుగ్రాసం లేక బక్కచిక్కుతున్న గేదెలు రాయితీపై పాతర గడ్డి ఇవ్వని కారణంగా పల్లెల్లో పశు పోషకులు వరిగడ్డి పైనే ఆధారపడాల్సి వస్తోంది. వరిగడ్డి ట్రాక్టర్‌ ట్రక్కు ధర రూ.20 వేల వరకు పలుకుతోంది. దీంతో కొనలేని పరిస్థితి నెలకొంది. ఎండాకాలం పాల దిగుబడి తగ్గడంతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఐదేళ్లుగా పాతర గడ్డి పెంపకానికి ప్రోత్సాహం అందకపోవడం, రాయితీపై దాణా ఇవ్వకపోవడంతో పాడి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.పశు పోషణ భారమవుతోంది.. పశుగ్రాసం ధర పెరిగింది. పోషణ భారం అవుతోంది. వ్యవ సాయంలో నష్టాలు వస్తుండడంతో ప్రత్యా మ్నాయంగా పాడి పరిశ్రమ ఎంచుకున్నా. ఎనిమిది సంవత్సరాల నుంచి నాలుగు పాడి పశుపు పెట్టుకొని జీవనం సాగిస్తు న్నాను. పశువుల పోషణకు నెలకు ఒక ట్రాక్టర్‌ వరిగడ్డి రూ. 20 వేలు అవుతుంది పశుగ్రాసం విపరీతంగా పెరగడం వల్ల పశువులపోషణ భారం అయిందని వాటిని అమ్మడానికి నిర్ణయి ంచుకున్నా. – వి. రాము , కర్ణ పాపాయపల్లి, లింగాల మండలం.

➡️