అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణ హత్య..

Jan 17,2024 08:21 #Hatya
  • భార్య తల నరికిన భర్త

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం హత్య జరిగింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉండే వినయ్.. తన భార్య పుష్పలత తల నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పుష్పలతకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

➡️