బోగస్ ఓట్లను తొలగించారు : ఆమంచి

Dec 29,2023 00:06

ప్రజాశక్తి – పర్చూరు
నియోజకవర్గంలో 10468బోగస్ ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించినట్లు వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోగస్ ఓట్లను చేర్చే ప్రక్రియ గత దశాబ్ద కాలం నుండి కొనసాగుతుందని ఆరోపించారు. 2014, 2019ఎన్నికల సమయంలో 40వేల దొంగ ఓట్లను చేర్పినట్లు ఆరోపించారు. వాటిని తొలగించమని ఫారం7 ద్వారా ఫిర్యాదు చేస్తే దారుణంగా నీచమైన వ్రాతలు రాశారని అన్నారు. ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. తొలగించబడిన ఓట్లలో ఒక్క కారంచేడు గ్రామంలోనే 960, మార్టూరు మండలంలో 3123ఓట్లు ఉన్నట్లు వివరించారు. మరో 4వేల బోగస్ ఓట్లను కూడ తొలగించమని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియ రెండు సంవత్సరాల క్రితం మొదలైతే 25వేల బోగస్ ఓట్లు తొలగించే వారని చెప్పారు. బోగస్ ఓట్లను తొలగించే విషయంలో కృషి చేసిన నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కథారి అప్పారావు, బండారు ప్రభాకర్, నాగేశ్వరరెడ్డి, అడపా సుధాకర్ రెడ్డి, ముప్పాళ్ళ రాఘవయ్య, దగ్గుబాటి రామకృష్ణ, జువ్వా శివారాంప్రసాద్, మైలా నాగేశ్వరరావు, నూతలపాటి బలరాం, తులసి నాగమణి, జంగా అనీల్, ఆకుల హేమంత్, కంచెనపల్లి రమేష్, చిన్నయ్య, రోశయ్య పాల్గొన్నారు.

➡️