గాలికి కొట్టుకు పోయిన ఎన్నికల తనిఖీ కేంద్రం

Apr 4,2024 17:17 #Anantapuram District

ప్రజాశక్తి – చిలమత్తూరు : మండల పరిదిలోని 44 వ జాతీయ రహదారి కొడికొండ చెక్ పోస్టు ఆంద్ర కర్నాటక సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల తనిఖీ కేంద్రం సుడిగాలి ధాటికి లేచి పోయి విద్యుత్ తీగల స్థంబాలపై పడింది. ఆ సమయంలో తనిఖీ కేంద్రంలో తనిఖీలు చేసే పోలీసు సిబ్బంది, సాయుధ బలగాలకు చెందిన వారు ఉన్నారు‌. ఒక్క సారిగా గాలి రావడంతో చాకచక్యంగా టెంట్ క్రింద నుండి తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. టెంట్ విధ్యుత్ తీగలపై పడటంతో అప్రమత్తం అయిన అదికారులు విధ్యుత్ శాఖ వారితో కరెంట్ తీయించి టెంట్ ను దించే ప్రయత్నం చేస్తున్నారు‌. ఎన్నికల తనిఖీ సిబ్బందికి నాణ్యమైన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అదికారులు విపలమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికైన దృడమైన తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించల్సిన బాద్యత అధికారులపై ఉంది.

➡️