కోవిడ్‌ కన్నా 100 రెట్లు ప్రాణాంతకం

Apr 5,2024 12:43 #100 times, #birdflu, #covid, #researchers
  •  బర్డ్‌ఫ్లూపై పరిశోధకులు ఆందోళన

కెనడా : కోవిడ్‌ మహమ్మారి కంటే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్‌ఫ్లూలోని హెచ్‌5ఎన్‌1 రకం వైరస్‌ మహమ్మారిగా మారవచ్చని పేర్కొన్నారు. కెనడాకు చెందిన ఫార్మారంగ నిపుణులు జాన్‌ ఫౌల్టన్‌ కూడా బర్డ్‌ఫ్లూపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌5ఎన్‌1 వేరియంట్‌ మహమ్మారిగా మారవచ్చని, ఇది కోవిడ్‌ -19 కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని తెలిపారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన బర్డ్‌ఫ్లూ పరిశోధకులు డాక్టర్‌ సురేశ్‌ కూచిపూడి మాట్లాడుతూ … ఈ బర్డ్‌ఫ్లూకు మానవాళి చేరువవుతున్నదని, ఈ వైరస్‌ మనుషులతోపాటు జంతువులకు కూడా వ్యాపించవచ్చని అన్నారు. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌ కాదని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు వెంటనే సిద్ధం కావాల్సి ఉందన్నారు.

➡️