ఉపాధి పనులతో మెరుగైన ఆర్థికస్థితి : నీటి యాజమాన్య సంస్థ సంచాలకులు బొంతా అర్జునరావు

Mar 15,2024 00:13

ప్రజాశక్తి – పంగులూరు
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని నీటి యాజమాన్య సంస్థ జిల్లా సంచాలకులు బొంతా అర్జునరావు కోరారు. మండలంలోని రేణింగవరంలో గల రైతు వారి కుంటలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలను ఆయన గురువారం పరిశీలించారు. కూలీలు సకాలంలో పనిలోకి వచ్చి పని చేస్తే మంచి కూలి వస్తుందని అన్నారు. ఆ డబ్బు ద్వారా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. గృహాలు నిర్మించుకునే వారికి వంద రోజులు పని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా రైతు వారి కుంటల పనులను కూడా చేయాలని అన్నారు. మార్చి నెలలో 2వేల మంది ఉపాధి కూలీలకు పని చూయించాల్సిన అవసరం ఉందని అన్నారు. సిబ్బంది అందుకు తగ్గట్లు ప్రణాళిక చేసుకొని కూలీలకు పనులు చూపించాలని కోరారు. ఉపాధి కూలీల పని పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పనులు చూపించాలని సిబ్బందికి సూచించారు. ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నాము కనుక ఎక్కువ మందికి వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకునే విధంగా పనిలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేష్, అదనపు కార్యక్రమ అధికారి కె సంతోషం, ఈసి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

➡️