ద్రాక్షారామలో చలివేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : మండలంలోని ద్రాక్షారామలో సూర్య చంద్ర ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రంను పట్టణ ఆటో యూనియన్‌ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆటో యూనియన్‌ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రయాణికులకు దాహర్తిని తీరుస్తుందని దీనిని ఏర్పాటు చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడి, మజ్జిగను పంపణి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

➡️