రాజంపేటలో.. వైసిపికి బీటలు

ప్రజాశక్తి – కడప ప్రతినిధిరాజంపేటలో వైసిపి బీటలు బారింది. రెండేళ్ల కిందటి నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమరనాధరెడ్డి అనుచరుల, ఎమ్మెల్యే మేడా అనుచరుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకుని రావడం, రాజంపేట టికెట్‌ను మేడాకు నిరాకరించడంతో అసమ్మతి పతాక స్థాయికి చేరుకుంది. ఆకేపాటికి టికెట్‌ను ఖరారు చేయడంతో ఎమ్మెల్యే అనుచరుల్లో అసహనం నివురుగప్పిన నిప్పులా మారింది. నియోజకవర్గవ్యాప్తంగా బూత్‌ కమిటీలు మొదలుకుని ఇతర నియామకాల్లో ఎమ్మెల్యే అనుచరుల పాత్రను పరిమితం చేయడంతో వ్యవహారం చెడినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండ్రోజుల కిందట మేడా, అనుచరులు సమావేశమై టిడిపిలో చేరిపోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం రాత్రి రాజంపేట, సుండుపల్లి, ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలకు చెందిన సుమారు 500 మంది ఎమ్మెల్యే మేడా అనుచరులు మూకుమ్మడిగా ప్రతిపక్ష టిడిపిలో చేరిపోయారు. రంజాన్‌ పండుగ అనంతరం రాజంపేట, నందలూరు, వీరబల్లి మండలాలకు చెందిన మరి కొందరు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం తెలుస్తోంది. రాజంపేట వైసిపి ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాధరెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎమ్మెల్యే మేడాను కలిసి సంప్రదింపులు చేసింది. ఎన్నికల ప్రచారానికి రావాలని మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాజంపేటలో టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో వైసిపి నుంచి ప్రతిపక్ష టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతుండడంతో వైసిపి ఆత్మరక్షణలో పడిపోయింది. రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, వీరబల్లి మండలాలు వైసిపికి పెట్టనికోటలు. ఇక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల నుంచి నాలుగు వేలకుపైగా వైసిపి మెజార్టీ లభిస్తోంది. ఇటువంటి మండలాలకు చెందిన కేడర్‌ టిడిపిలోకి భారీగా వలస వెళ్తుండడం చర్చ నీయాంశంగా మారింది. ప్రతిపక్ష టిడిపికి పట్టు కలిగిన రాజంపేట, సుండుపల్లి, నందలూరు, సిద్ధవటం మండలాల నుంచి సైతం వలసలు వెళ్తుతున్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు ఎదురు తిరిగినప్పటికీ ఇంతటి స్థాయిలో ప్రభావం కనిపించలేదు. ఎమ్మెల్యే అనుచరులు పోలింగ్‌కు ముంగిట ఇంతటిస్థాయిలో ఎదురు తిరగడంతో వైసిపి ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాధరెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎమ్మెల్యే మేడాను కలిసి సంప్రదింపులు చేసింది. ఎన్నికల ప్రచారానికి రావాలని మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాజంపేటలో టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో వైసిపి నుంచి ప్రతిపక్ష టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతుండడంతో వైసిపి ఆత్మరక్షణలో పడిపోయింది. రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, వీరబల్లి మండలాలు వైసిపికి పెట్టనికోటలు. ఇక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల నుంచి నాలుగు వేలకుపైగా వైసిపి మెజార్టీ లభిస్తోంది. ఇటువంటి మండలాలకు చెందిన కేడర్‌ టిడిపిలోకి భారీగా వలస వెళ్తుండడం చర్చ నీయాంశంగా మారింది. ప్రతిపక్ష టిడిపికి పట్టు కలిగిన రాజంపేట, సుండుపల్లి, నందలూరు, సిద్ధవటం మండలాల నుంచి సైతం వలసలు వెళ్తుతున్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు ఎదురు తిరిగినప్పటికీ ఇంతటి స్థాయిలో ప్రభావం కనిపించలేదు. ఎమ్మెల్యే అనుచరులు పోలింగ్‌కు ముంగిట ఇంతటిస్థాయిలో ఎదురు తిరగడంతో వైసిపి ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పవచ్చు.

➡️