రైతులకు అవగాహన సదస్సు

Nov 23,2023 00:24

ప్రజాశక్తి – కర్లపాలెం
మండలంలోని బుద్ధాం గ్రామం నందు పొలంబడి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మేలైన యాజమాన్య పద్ధతులపై డిడిఏ బాలు నాయిక్ అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకు ఒక సర్టిఫికేట్ కల్పించిందని అన్నారు. వారి దిగుబడిని అధిక రేటుకు విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్ర యాజమాన్య పద్ధతులపై మొగ్గు చూపాలని సూచించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి, నాణ్యమైన పురుగు మందుల అవశేషాలు తక్కువగా కలిగి ఉండే దిగుబడులు పొందడానికి పొలంబడి ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం వరిలో వచ్చు తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. ఏడిఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరిలో యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తున్న రైతులకు, ఇతరలుకు మధ్య వ్యత్యాసాన్ని, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడిఏ లక్ష్మీ, ఎఒ సుమంత్ కుమార్, పొలంబడి ఏఓ కిరణ్మయి, వ్యవసాయ సహాయకులు బాజి, గోపి, సునీత పాల్గొన్నారు.

➡️