వెనిజులాలో కూలిన బంగారు గని.. 14 మంది మృతి

Feb 22,2024 15:50 #mine collapse, #Venezuela

 కారకాస్‌  :    సెంట్రల్‌ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్‌ పిట్‌ బంగారు గని కుప్ప కూలింది. మంగళవారం అంగొస్తురా మునిసిపాలిటీలో బుల్లలోకా అని పిలిచే గని గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ గనికి చేరుకోవాలంటే కొన్ని గంటల పాటు పడవ ప్రయాణం చేయాల్సి వుంది. ఈ ఘటనలో సుమారు 14 మంది మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

గనిలో ఎంత మంది చిక్కుకున్నారనే అంశంపై స్పష్టత లేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంగొస్తురా మేయర్‌ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. గాయపడిన వారిని రక్షించడానికి, మృతదేహాలను వెలికి తీసేందుకు విమానాలను పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు బొలివర్‌ రాష్ట్ర గవర్నర్‌ ఏంజెల్‌ మార్కానో స్థానిక మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో కూడా స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సివిల్‌ డిఫెన్స్‌ బఅందాలను పంపినట్లు తెలిపారు.

➡️